Laxmi parvathi: ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచేలా చంద్రబాబు ఒక్క పనిచేయలేదు..

UPDATED 4th APRIL 2022 MONDAY 11:20 AM

Laxmi parvathi : స్వర్గీయ ఎన్టీఆర్ పేరుచెప్పి ఎంతో చేస్తున్నామన్న టీడీపీ, చంద్రబాబు ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచేలా ఒక్క చర్య తీసుకోలేదని, చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు.

సోమవారం ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలను సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయం నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన లక్ష్మీపార్వతి నూతన కలెక్టర్ ఢిల్లీరావుకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు.ఎన్టీఆర్ కు దండలు వేస్తారు, పొగుడుతారని కానీ ఎన్టీఆర్ పేరు నిలిచేలా శాశ్వతంగా ఒక్క మంచిపని కూడా చంద్రబాబు చేయలేదని అన్నారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని లాక్కున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్ తో ఎలాంటి సంబంధం లేదని, ఆయన గురించి తెలియకపోయినా సీఎం జగన్ నూతన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

అంతేకాక ఎన్టీఆర్ తరహాలోనే మరికొన్ని జిల్లాలకు అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, సత్య సాయి వంటి పెద్దల పేర్లు పెట్టడం శుభపరిణామమని,జిల్లాల పేర్లతో పెద్దల ఆశీస్సులు సీఎం జగన్ కు ఉంటాయని లక్ష్మీపార్వత్రి తెలిపారు. చంద్రబాబు చేయలేని పని జగన్ చేస్తున్నారని, మీ నాయకుడు చేయలేని పని మా నాయకుడు చేశారంటూ టీడీపీ శ్రేణుల నుద్దేశించి లక్ష్మీపార్వత్రి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా ఏపీలోనే మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నానని ఆమె ఆకాంక్షించారు.

ఎన్టీఆర్ పుట్టింది నిమ్మకూరు అయినా విజయవాడతో ఎక్కువ అనుబంధం ఉందని, ఎన్టీఆర్ బాల్యమంతా విజయవాడలోనే గడిచిందని లక్ష్మీపార్వతి తెలిపారు. ఎన్టీఆర్ గుడివాడలోనే కాదు హిందూపురం, టెక్కలి వంటి ప్రాంతాల్లో కూడా పోటీచేశారని లక్ష్మీపార్వత్రి తెలిపారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us