PM Modi: ప్రధాని మోడీ పర్యటనకు 8 వేలమంది పోలీసులతో భద్రత : డీజీపీ మహేందర్ రెడ్డి

UPDATED 4 FEBRUARY 2022 FRIDAY 03:15 PM

ముచ్చింతల్ (రంగారెడ్డి) రెడ్ బీ న్యూస్: ముచ్చింతల్ లో జై శ్రీమన్నారాయణ శబ్దాలతో మారుమ్రోగుతోంది. గుతోంది. యాగశాల, సమతామూర్తి ప్రాంగణానికి వేలాది మంది భక్తులు తరలివస్తుండడంతో ఆధ్మాత్మిక శోభ విల్లివిరుస్తోంది. త్రిదండి చిన్న జీయర్ స్వామి నేతృత్వంలో వేలాది మంది పండితులు క్రతువును నిర్వహిస్తున్నారు. మహాక్రతువుతో ముచ్చింతల్ పులకిస్తోంది.

ఈ మహోత్సవానికి ప్రధాని మోడీని విచ్చేస్తున్నారు. దీంతో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది పోలీసు యంత్రాంగం. ముచ్చింతల్ లో ప్రధాని మోడీ పర్యన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సీఎస్ సోమేష్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రధాని మోడీ పర్యనకు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ముచ్చింత పర్యటనలో భాగంగా సమతాపూర్తి సన్నిథిలో ప్రధాని మోడీ మూడు గంటలపాటు ఉంటారని..అన్ని పూర్తి అయ్యాక ప్రధాని మోడీ రాత్రి 8.00గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారని తెలిపారు. ముచ్చింతల్ లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 8వేలమంది పోలీసులో భద్రత ఏర్పాట్లు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. 

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు ప్రభుత్వం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు..

ప్రధాని భద్రత కారణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు ప్రభుత్వం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కనివినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. శనివారం (ఫిబ్రవరి 5,2022) మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని… హెలికాప్టర్‌లో 2:45 గంటలకు ఇక్రిశాట్‌కు చేరుకుని స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు. మొక్కల రక్షణ కోసం వాతావరణ మార్పు పరిశోధన కేంద్రాన్ని, రాపిడ్‌ జనరేషన్‌ అడ్వాన్స్‌మెంట్‌ సౌకర్యాన్ని ప్రారంభిస్తారు. అనంతరం స్వర్ణోత్సవాల లోగోను ఆవిష్కరించి, ప్రత్యేక పోస్టల్‌ స్టాంపును విడుదల చేస్తారు. ఆ తర్వాత అక్కడి శాస్త్రవేత్తలతో భేటీ కానున్నారు. ఆపై హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు చేరుకొని రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.

8 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు..

ఇటీవల పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్‌ నిలిచిపోయిన ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ హైదరాబాద్‌ పర్యటనను అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఏకంగా ఏడు వేల మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని భద్రతా ఏర్పాట్లు చూసే ఎస్పీజీ అధికారులు రాష్ట్ర పోలీసులతో అనేకసార్లు సమావేశమయ్యారు. ప్రధాని పర్యటించే మార్గంలో గురువారం నుంచే అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజనింగ్‌ (ఏఎస్‌ఎల్‌) మొదలుపెట్టారు. ముచ్చింతల్‌ ప్రాంతమంతా అష్టదిగ్బంధనం చేశారు.

5.15కి యాగశాలకు ప్రధాని రాక..

ఇక్రిశాట్ నుంచి ప్రధాని హెలికాప్టర్‌లో 5.15కి ప్రధాని యాగశాలకు చేరుకుంటారు. 5.30 నుంచి 6 గంటల వరకు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత రామానుజుల విగ్రహాన్ని ప్రపంచానికి అంకితం చేస్తారు. అక్కడ ప్రత్యేక పూజ నిర్వహించి సందేశాన్నిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీ వెళ్తారు. తిరుగుప్రయాణంలో ప్రధాని 13 కి.మీ. రోడ్డుమార్గంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆ సమయంలో ఈ మార్గంలో ఎవరినీ అనుమతించబోమని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.

15 నెలల తర్వాత తెలంగాణకు రానున్న ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్రమోదీ 15 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. 2020 నవంబరు 28న జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌కు వచ్చి జినోమ్‌వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాల తయారీ కేంద్రాన్ని సందర్శించి వెళ్లారు. తాజాగా కేంద్ర బడ్జెట్‌‌ను ఉద్దేశిస్తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మోదీ తెలంగాణ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముచ్చింతల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు కలిసి వేదికను పంచుకోనున్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us