కట్టమూరులో చలివేంద్రం ఏర్పాటు

Updated 21st April 2017 Friday 1:30 PM

పెద్దాపురం: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార  పరపతి సంఘాల (పిఎసిఎస్ ) ఆద్వర్యంలో మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దాపురం మండలం కట్టమూరు పిఎసిఎస్ అధ్యక్షుడు చల్లా చిన వీర్రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కట్టమూరు జంక్షన్ లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజు రోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈవో  పి.ఎస్.వి.ఎన్ ఆచార్యులు, పిట్టు రంగారావు తదితరులు పాల్గొన్నారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us