ప్రగతిలో డేటా సైన్స్ బెస్ట్ ఆన్ ఆర్- ప్రోగ్రామింగ్ పై గెస్ట్ లెక్చర్

UPDATED 3rd MARCH 2018 SATURDAY 6:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో డేటా సైన్స్ బెస్ట్ ఆన్ ఆర్- ప్రోగ్రామింగ్ పై శనివారం గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎన్ఐటి ప్రొఫెసర్ డాక్టర్ డి.వి.ఎల్.ఎన్. సోమయాజులు హాజరైనారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా డాటా అనాలసిస్, రీసెర్చ్, వాటి ఉపయోగాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ సోమయాజులు మాట్లాడుతూ బిటెక్ విద్యార్థులకు ఆర్- ప్రోగ్రామింగ్ డాటా ఎనలైజింగ్ చేయడానికి, మెషిన్ లాంగ్వేజ్ అప్లికేషన్స్ కనుగొనడానికి, వివిధ ప్రాంతాలలో లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ రోజులలో సాఫ్ట్ వేర్ అనేది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు మంచి కెరీర్ అందిస్తుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ ఈ గెస్ట్ లెక్చర్ అన్ని విభాగాల ఇంజనీరింగ్ విద్యార్థులు ఆధునిక పరిజ్ఞానం, సాంకేతిక, కళాత్మక అవగాహన పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. లీలావతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.కవిత,  విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us