Somu veerraju: తీరు మార్చుకోకపోతే తాడో పేడో తేల్చుకుంటాం : సోము వీర్రాజు

విజయవాడ (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనలో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు ఘటన సమయంలో పోలీసుల పైనా దాడి జరిగిందని చెప్పారు. బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డిని చంపేస్తామంటూ బెదిరించిన ఆడియో తమ దగ్గర ఉందన్నారు. తప్పుడు కేసు పెట్టి ఆయన్ను జైలుకు పంపిస్తారా? వైసీపీకి ప్రజలు అధికారమిచ్చింది అరాచక పాలన చేసేందుకా? అని ఆయన నిలదీశారు. శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలు పంపిస్తున్నారని.. ఇప్పటికైనా వైసీపీ తీరు మార్చుకోకపోతే తాడో పేడో తేల్చుకుంటామన్నారు. చేతనైతే నిత్యావసరాల ధరలు తగ్గించండి సినిమా టికెట్ల అంశంలో ఏపీ ప్రభుత్వ ఆలోచనేంటని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఇసుక ధరలు ఎందుకు తగ్గించరని నిలదీశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించి గొప్పగా చెప్పుకోవడమేంటని.. చేతనైతే నిత్యావసరాల ధరలు తగ్గించాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనేవాళ్లు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారని.. బియ్యం అక్రమ రవాణాలో వైసీపీ నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us