UPDATED 25th MARCH 2022 FRIDAY 10:15 AM
Student Kidnapped and Tortured : కర్నూలు నంద్యాలలో ఓ రాజకీయ నాయకుడి కుమారుడి దాష్టీకం వెలుగులోకి వచ్చింది. డిగ్రీ విద్యార్థిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసినట్లు తెలుస్తోంది. బాధిత విద్యార్థి సాయి హేమంత్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి సాయి హేమంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రాజకీయ పార్టీ నాయకుడి కుమారుడు విద్యార్థిపై దాడి చేసినట్లు సమాచారం.కాలేజీలో సాయి హేమంత్ అనే డిగ్రీ స్టూడెంట్ ను అతని తండ్రికి ప్రమాదం జరిగిందని రాజకీయ నాయుకుడి కుమారుడు బయటకు తీసుకొచ్చి, కిడ్నాప్ చేశాడు. ప్రధమనందిలోని కళ్యాణ మండపానికి తీసుకెళ్లి సాయి హేమంత్ ను చిత్రహింసలకు గురిచేశారు.
గాయాలపాలైన సాయి హేమంత్ కు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అంతేకాకుండా సాయి హేమంత్ తండ్రిని కూడా ప్రధమ నంది కళ్యాణ మండపానికి పిలిపించి అతని అబ్బాయిని కాలేజీ మానిపించి, ఊరు వదిలి పెట్టి వెళ్లాలని బెదిరింపులకు గురి చేశాడు. ఓ యువతి విషయంలో చేయని తప్పుకు తన కుమారుడిని అన్యాయంగా కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశాడని సాయి హేమంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.