Gold And Diamonds : అనధికారికంగా తరలిస్తున్న బంగారం, వజ్రాలు పట్టివేత

UPDATED 1st MARCH 2022 TUESDAY 11:20 AM

Gold And Diamonds : హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో భారీగా బంగారు నగలు, వజ్రాలను పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద ఎస్ఈబీ పోలీసులు తనికీలు చేస్తుండగా ఇవి బయట పడ్డాయి.

హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో రాజస్థాన్ లోని జన్జును కు చెందిన కపిల్ అనే యువకుడు తన బ్యాగులో 840 గ్రాముల బంగారు ఆభరణాలు, 57 వజ్రాలు తీసుకువెళ్తున్నాడు. ఎస్ఈబీ సిబ్బంది చెక్ పోస్ట్ వద్ద చేస్తున్న తనిఖీల్లో వీటిని కనుగొన్నారు. వీటికి సంబంధించి బిల్లులు, జీస్టీ ట్యాగ్ లు లేకపోవటంతో కపిల్ ను విచారణ నిమిత్తం కర్నూల్ అర్బన్ తాలూకా పోలీసులకు అప్పగించారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us