UPDATED 28th NOVEMBER 2017 TUESDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థి డిసెంబర్ 12 నుంచి 16 వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరులో జరగబోయే 78 వ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సుగుణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీల్లో కాకినాడ జె.ఎన్.టి.యూలో జరిగిన అంతర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ పోటీల్లో తమ కళాశాలలో బిబిఎ చదువుతున్న కె.వి.ఎస్.ఆర్.దుర్గాప్రసాద్ విశేష ప్రతిభ కనబరిచి అఖిల భారత అంతర్ యూనివర్సిటీ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆమె తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు వారికి గల ఆసక్తిని బట్టి వివిధ క్రీడలలో తర్ఫీదునిచ్చి వారిలోగల ప్రతిభాపాటవాలను వెలికితీసి ఆయా రంగాల్లో ప్రావీణ్యం చూపేవిధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఎంపికైన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపక, అధ్యాపకేత సిబ్బంది, తదితరులు అభినందించారు.







