ఆదిత్యలో ఘనంగా ముగిసిన "పోలీ వేద 2 కె 17"

UPDATED 16th SEPTEMBER 2017 SATURDAY 7:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన "పోలీ వేద 2 కె 17 " శనివారం ఘనంగా ముగిసినట్లు సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల నుంచి వచ్చిన సుమారు 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోకుండా పాలిటెక్నిక్ విద్యార్థులు వారి సృజనాత్మకతకు పదునుపెట్టి  రూపొందించిన వివిధ రకాల ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులతో పరస్పర భావాలను, ఆలోచనలను పంచుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక చక్కని వేదికగా ఉపయోగపడిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ మాధవరావు చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచ్ లకు చెందిన హెచ్వోడీలు, అధిక సంఖ్యలో  విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us