ఆదిత్యలో ఘనంగా వరల్డ్ ఫార్మసిస్ట్ డే వేడుకలు

UPDATED 23rd SEPTEMBER 2017 SATURDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఫార్మసీ కళాశాలల ఆధ్వర్యంలో శనివారం వరల్డ్ ఫార్మసిస్ట్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా డ్రగ్ ఇనస్పెక్టర్ ఎం. చంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీరోజు విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోవాలని, అలాగే విద్యార్థులు మార్కుల కోసమే కాకుండా సామాజిక స్పృహను పెంపొందించుకోవాలన్నారు. ఔషధ పరిశ్రమలో అపార అవకాశాలున్నాయని విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ వరల్డ్ ఫార్మసిస్ట్ డే ను ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ రూపకల్పనలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె. రవిశంకర్, ప్రిన్సిపాల్ డాక్టర్ దివాకర్ మాట్లాడుతూ ఉపాన్యాసాలు ఇవ్వడం, ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు ఒక ఫార్మసీ అనేక మార్గాల్లో సూచికగా ఈ వరల్డ్ ఫార్మసీ డే నిర్వహిస్తారని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ కె. రవిశంకర్, అసోసియేట్ ప్రొఫెసర్ కిరణ్మయి, రచయితలుగా వెలువడిన "క్లినికల్ ఫార్మసీ అండ్ ఫార్మకోతే రెఫుటిక్స్" ఎడిషన్ ను చంద్రరావు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us