భద్రాద్రి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : భద్రాచలం రాములోరి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేదని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఆన్‌లైన్‌లో అమ్మిన టికెట్ల డబ్బులు భక్తులకు తిరిగి చెల్లించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న తెప్పోత్సవం, 13న ఉత్తర ద్వారా దర్శనం ఉంటుంది. వేదపండితులు, అర్చుకుల సమక్షంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.







