మరిడమ్మ జాతరకు భక్తుల రద్దీ

UPDATED 2nd JULY 2017 SUNDAY 4:00 PM

పెద్దాపురం : భక్తుల కొంగు బంగారం పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఆర్.పుష్పనాథం పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలు స్వచ్ఛంధ సంస్థలు తమ సేవలను అందించారు. దీనిలో భాగంగా ఆర్యవైశ్య సేవాసంఘం ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు పాలు, భక్తులకు మంచినీరు, పులిహోర ప్రసాదం, అలాగే హరిశంకరాచార్య వేద ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు పాలు పంపిణీ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మ వారి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిట్టెం హరిగోపాల శర్మ, తమ్మన కృష్ణ ప్రసాద్, విజ్జపు రాజశేఖర్, బొండాడ పెరుమాళ్ళు, కొత్త వీరభద్రరావు, ట్రస్టీలు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us