మీ అభిమానం మరిచిపోలేను.. తెలుగు రాష్ట్రాల పర్యటనపై సీజేఐ

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ఎప్పట్నుంచో స్వగ్రామం వెళ్లి తన వాళ్లను పలకరించాలన్న తన కోరిక కోర్టుకు శీతాకాలం సెలవులు ఇవ్వడంతో నెరవేరిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాల పర్యటన ముగించుకుని దిల్లీ చేరుకున్న ఆయన.. పర్యటనలో తనపట్ల ప్రజలు చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘రాష్ట్ర సరిహద్దుల్లోనే ప్రజలు నాకు ఘనస్వాగతం పలికారు. పొన్నవరం వాసులు ఎడ్లబండిపై తీసుకెళ్లడం నన్ను కదిలించింది. మూలాలు మరిచిపోవద్దు అనేదాన్ని నేను బలంగా నమ్ముతా. అల్లుళ్లు, మనుమరాళ్లకు తొలిసారి మా ఊరు చూపించి సంతృప్తి చెందా. పొన్నవరం వీధుల్లో నడుస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. విందు ఇచ్చిన సీఎం జగన్‌, గవర్నర్ బిశ్వభూషణ్‌కు ధన్యవాదాలు. నాకు అందిన ఆతిథ్య ఆహ్వానాల్లో కొన్నింటినే ఆమోదించగలిగాను. నన్ను సత్కరించిన బార్ అసోసియేషన్, హైకోర్టు ఉద్యోగులకు కృతజ్ఞతలు. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల పట్ల తెలుగువాళ్లు చూపిన గౌరవం మరిచిపోలేను. నా కోసం వేచిచూసి, నన్ను దీవించిన అందరికీ నమస్సులు. మీ అభిమానం, నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇస్తున్నా’’ అని సీజేఐ అన్నారు. తన పర్యటన సాఫీగా జరిగేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ జస్టిస్ ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us