ఆదిత్య క్యాంపస్ ను సందర్శించిన బీహార్ ఎం ఎల్ సి బృందం

UPDATED 20th SEPTEMBER 2017 WEDNESDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో బీహార్ కు  చెందిన ఎం ఎల్ సి బృందం బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా నీరజ్ కుమార్, దిలీప్ కుమార్ చౌదరి, సంజీవ్ కుమార్ సింగ్, చండీశ్వర ప్రసాద్, బృందం కళాశాలలో పర్యటించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కళాశాలలో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, బిజినెస్ మేనేజ్మంట్ కోర్స్ లను అభ్యసిస్తున్న బీహార్ విద్యార్థులతో వారు మాట్లాడారు. విద్యార్థులకు అందుతున్న వసతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో నిర్వహిస్తున్న ఈ కళాశాలలో తమ రాష్ట్రానికి చెందిన  విద్యార్థులు  విద్యను అభ్యసించడం తమకు గర్వకారణమన్నారు. తమ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డిని కోరారు. అనంతరం ఎం ఎల్ సి బృందాన్ని చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, డైరెక్టర్ ఫారిన్ అడ్మిషన్స్ పరంజీత్ సింగ్, బీహార్ ఎం ఎల్ సి బృంద సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, బీహార్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us