Tirumala: తిరుమలలో ఎఫ్ఎమ్‌ఎస్‌ ఏజెన్సీ సేవలు పునరుద్ధరించాలి: అదనపు ఈవో ధర్మారెడ్డి

తిరుమల (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: తిరుమలలో ఎఫ్‌ఎమ్‌ఎస్‌ ఏజెన్సీ సేవలు వెంటనే పునరుద్ధరించాలని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. అన్నమయ్య భవన్‌లో ఎఫ్‌ఎమ్‌ఎస్‌ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. రెండు..మూడు రోజల్లో తగినంత మంది సిబ్బందితో వెంటనే సేవలు పునరుద్ధరించాలని ఆదేశించారు. గత కొద్దిరోజులుగా ఎఫ్‌ఎమ్‌ఎస్‌ ఏజెన్సీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు తితిదే కార్పొరేషన్‌లో కలపాలని కోరుతూ తిరుమల, తిరుపతిలో విధులకు హాజరుకాకుండా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా శ్రీవారి భక్తులకు తిరుమల, తిరుపతిలో తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ఏజెన్సీలు కొత్త వారితో ఖాళీలను భర్తీ చేసి భక్తులకు పూర్తి స్థాయిలో సేవలందించాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకొని కొత్త ఏజెన్సీలకు అప్పగిస్తామన్నారు. గుత్తేదారులు స్పందించికపోతే అవసరమైన పారిశుద్ధ్య కార్మికులను ఆరోగ్య విభాగం ద్వారా నియమించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో ఆదేశించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us