రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022: గోదావరి తీరంలో తొలిసారిగా మహోన్నత ఘట్టం.. కలియుగ దైవం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్ర భూసమేత శ్రీవేంకటేశ్వరుని దివ్య కల్యాణ మహోత్సవం.. భక్తజన సమూహం, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ధనుర్మాసం సందర్భంగా ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం వి.ఎల్.పురంలోని మార్గాని ఎస్టేట్స్ మైదానంలో ఈ వేడుక నయనానందం పంచింది. మహోత్సవంలో కలెక్టర్ హరికిరణ్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, జడ్పీ ఛైర్మన్ వి. వేణుగోపాలరావు, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ భరత్‌రామ్ పర్యవేక్షణలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, కొత్త బాలమురళీకృష్ణ, ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) ట్రస్టు బోర్డు సభ్యురాలు కొత్త విజయరాజ్యలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణ వేడుక కనులపండువగా సాగింది.







