ఏటూరు నాగారం (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కె.కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొర్స రమేశ్‌ను మావోయిస్టులు హత్య చేశారు. రెండు రోజుల కిందట రమేశ్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో అతడిని చంపేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి సమీపంలో మాజీ సర్పంచి మృతదేహాన్ని గుర్తించారు. రమేశ్‌ను ప్రజాకోర్టులో శిక్షించినట్లు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నందునే చంపినట్లు వెల్లడించారు. వెంకటాపురం- వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.







