UPDATED 3rd NOVEMBER 2022 THURSDAY 7:58 AM
TDP Leader Ayyanna Patrudu Arrest: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ సిఆర్‌పిసి 50ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి పోలీసులు అయ్యన్నపాత్రుడు, అతను చిన్న కుమారుడిని అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చిన వివాదంలో అయ్యన్న పాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీ డాక్యుమెంట్లుగా పేర్కొంటూ మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 464, 467, 471, 474, 34 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో వీరిద్దరిని హాజరు పరచనున్నట్లు నోటీసులో సీఐడీ పోలీసులు పేర్కొన్నారు.







