పదోన్నతులు కల్పించాల్సిందే

UPDATED 2nd APRIL 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: గ్రామ రెవెన్యూ అధికారులకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ బుధవారం తహసీల్దారు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల వీఆర్‌ఓలు హాజరై నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూశాఖలో కీలకంగా పనిచేస్తున్న వీఆర్‌ఓలకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. అటెండరుగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన వారు కూడా ఆర్‌ఐలు, సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందుతున్నా, వీఆర్‌ఓల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీఆర్‌ఓలకు పదోన్నతుల విషయంలో న్యాయం చేయాలని కోరారు. అనంతరం వారు డిప్యూటీ తహసీల్దారుకు, హోంమంత్రి పిఎకు వినతిపత్రాలు సమర్పించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us