ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

UPDATED 8th JULY 2020 WEDNESDAY 5:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): దివంగత నేత, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన అందించిన డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను బుధవారం పెద్దాపురం పట్టణ, రూరల్ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దవులూరి సుబ్బారావు, నెక్కంటి సాయి ప్రసాద్, కాపగంటి కామేశ్వరరావు, కందుల వెంకటచలం, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us