Ananya Landet: అటువంటి సంబంధాల గురించి లైగర్ బ్యూటీ ఏమంటోందంటే...

REDBEENEWS: వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాల్ని తమ చిత్రం గొప్పగా చూపించబోదంటోంది అనన్య పాండే. లైగర్లో విజయ్ దేవరకొండని రొమాన్స్ చేయనున్న బీ-టౌన్ యంగ్ బ్యూటీ త్వరలోనే గెహ్రాయియా సినిమాలో కనిపించనుంది. అయితే, అనన్యతో పాటూ దీపికా పదుకొణే, సిద్ధాంంత్ చతుర్వేది కూడా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ గెహ్రాయియా చెడుని హైలైట్ చేసే చిత్రం ఎంత మాత్రం కాదట.

భార్యాభర్తలు, ప్రేమికులు... ఒకర్ని ఒకరు మోసం చేసుకునే సంబంధాల్ని తాము సమర్థించటం లేదంటోంది అనన్య. గ్రెహ్రాయియాలో ఒకానొక స్థితిలో నలుగురు వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారన్నది మాత్రమే ప్రేక్షకులు చూడబోతున్నారని ఆమె వివరించింది. అయితే, తన పర్సనల్ లైఫ్‌లో లవ్ గురించి కూడా ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేసిన బాలీవుడ్ ఏంజిల్... ప్రేమంటే చాలా వరకూ భావాల కలయిక, స్నేహమేనంటోంది!

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us