UPDATED 1st JULY 2017 SATURDAY 6:00 PM
పెద్దాపురం: స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో శనివారం ఘనంగా వనమహోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు చేస్తున్నకృషి అభినందనీయమన్నారు. ప్రతీ ఒక్కరూ తమ పరిసరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. అలాగే మరో ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ వనమహోత్సవం పేరుతో శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు మొక్కలు నాటడం, అలాగే విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన పెంపొందించడంపై పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ చిట్టూరి విజయ ప్రకాష్, పాఠశాల డీన్ రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, లైజన్ ఆఫీసర్ ఎం. సతీష్, తదితరులు పాల్గొన్నారు.







