Nara Lokesh : ఆగిన నారా లోకేశ్ పాదయాత్ర.. ఎందుకంటే

Updated 25th May 2023 Thursday 6:50 pm

Nara Lokesh – Mahanadu : టీడీపీ నేత నారా లోకేశ్ తన యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. లోకేశ్ విజయవాడ చేరుకున్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించాక తొలిసారి విజయవాడకు వెళ్లారు లోకేశ్. మహానాడులో పాల్గొనేందుకు 4 రోజుల పాటు యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు లోకేశ్. మహానాడు ఏర్పాట్లు, కమిటీల పనితీరుపై లోకేశ్ సమీక్షించారు. రేపు (మే 26) విజయవాడ నుంచి చంద్రబాబు, లోకేశ్ రాజమండ్రి వెళ్లనున్నారు. మహానాడు ప్రాంగణానికి ఒకరోజు ముందుగానే చంద్రబాబు, లోకేశ్ చేరుకోనున్నారు.

పాదయాత్రను 4 రోజుల పాటు నిలిపేయనున్నారు లోకేశ్. మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరగనుండడమే ఇందుకు కారణం. అందులో పాల్గొనేందుకు.. యాత్రకు విరామం ప్రకటించారు లోకేశ్. తిరిగి ఈ నెల 30న తన యాత్రను కంటిన్యూ చేయనున్నారు.

ప్రస్తుతం జమ్మలమడుగులో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. అక్కడ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. జమ్మలమడుగు నుంచి కడప ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. రేపు (మే 26) అమరావతి నుంచి బయలుదేరి రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి చేరుకోనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us