ఆదిత్యలో స్మైల్ మెడిటేషన్ అకాడమీ శిక్షణా తరగతులు

UPDATED 27th NOVEMBER 2017 MONDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఒత్తిడిని అధిగమించడం ఎలా అనే అంశంపై ఇంజనీరింగ్ విద్యార్థులకు స్మైల్ మెడిటేషన్ అకాడమీకి చెందిన డాక్టర్ పంకజ్ జైన్ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పంకజ్ జైన్ ముద్ర, మంత్ర, శ్వాస ప్రక్రియలు, మానవ శరీరంలో గల వివిధ త్రిముద్రా విధానాల ద్వారా ఒత్తిడిని ఏ విధంగా అధిగమించవచ్చునో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా తెలియచేశారు. స్మైల్ విధానం, యోగా ముద్రలు ద్వారా ఒత్తిడి లేని జీవితం గడపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, స్మైల్ మెడిటేషన్ అకాడమీ సభ్యులు రామూర్తి, రమ్య, అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us