UPDATED 1st MAY 2017 THURSDAY 7:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో షిర్డీ సాయిబాబా ఐదవ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త మలకల సూర్యారావు ఆధ్వర్యంలో వేద పండితులు పాణింగిపల్లి శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో ఈ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే బాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. మహిళా భక్తులచే బాబా పారాయణం, భజనలు పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే పూజా కార్యక్రమాలను మలకల సూర్యారావు, పద్మావతి దంపతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మలకల సుబ్బాయమ్మ, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ తోటకూర రాంబాబు, సత్తిబాబు, గోపాలం, శ్రీనివాస ప్రకాశరావు, సూర్య ప్రభాకరావు తదితరులు పాల్గొన్నారు.







