ముంబయి (రెడ్ బీ న్యూస్) 18 డిసెంబర్ 2021: బిగ్గెస్ట్ యాక్షన్, ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలకపాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మాత. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈసినిమా మొదటి పార్ట్ మోషన్ పోస్టర్ శనివారం ఉదయం విడుదలైంది. ‘ఈ లోకంలో ఏదో జరుగుతోంది. ఈ విషయం మామూలు మనుషులకు అర్థం కాదు. కొన్ని పురాతన శక్తులున్నాయి. కొన్ని అస్త్రాలున్నాయి’’ అనే రణ్‌బీర్ డైలాగ్‌లతోపాటు ‘‘అవన్నీ నీకు ఎందుకు కనిపిస్తున్నాయ్.. అసలు నువ్వు ఎవరు శివా?’’ అంటూ వచ్చే ఆలియాభట్ సంభాషణలతో ఈ మోషన్ పోస్టర్ రూపుదిద్దుకుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈసినిమా మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్రం.. మొదటిభాగం: శివ’ అనే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్ రాజమౌళి సమర్పణలో 9.9.2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.







