25 సంవత్సరాల తర్వాత....

UPDATED 21st FEBRUARY 2018 WEDNESDAY 9:00 PM

పెద్దాపురం: దేశ, విదేశాల్లో స్థిరపడిన ఒకే కుటుంబానికి చెందిన సుమారు 80 మంది కుటుంబ సభ్యులు 25  సంవత్సరాల తర్వాత వారు పుట్టి పెరిగిన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చదలాడ గ్రామంలో బుధవారం సందడి చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ పోలవరపు సూర్యారావు సోదరుని కుమార్తె స్వర్ణలత, కోటి, తమసిలు కుటుంబ సభ్యులతో సహా అమెరికా నుంచి జిల్లాకు రావడంతో ఆత్మీయకలయికతో కనువిందు చేశారు. నిత్యం బిజీ బిజీ గడుపుతూ కుటుంబ బంధాలకు దూరమవుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ ఒక చోట కలవడం అభినందనీయమని ఎన్ఆర్ఐ కోటి అన్నారు. ఉదయం నుంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపిన అనంతరం పులిమేరు గ్రామంలోని శాంతివర్ధనా విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.           

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us