Road Accident: విశాఖలో రెండు బైకులు ఢీ.. ముగ్గురు యువకుల మృతి

విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : విశాఖలో కొత్త సంవత్సరం రోజు విషాదం చోటు చేసుకుంది. ఆరిలోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అతి వేగంగా వచ్చిన రెండు బైకులు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందడం ఆ మార్గంలో వెళుతున్న వారిని కలిచివేసింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఎలాంటి ప్రమాదాలు, రాస్‌ డ్రైవింగ్‌ జరగకుండా ఉండేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నిన్న రాత్రి 8గంటల నుంచి ఈ ఉదయం ఆరు గంటల వరకు ఆరిలోవ బీఆర్‌టీఎస్‌ రహదారిని మూసేశారు. ఆరు గంటల తర్వాత రహదారిని తెరిచిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us