అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని ట్వీట్ చేశారు. తాను కరోనా బారిన పడినట్లు.. స్వల్ప లక్షణాలు ఉన్నాయని చంద్రబాబు ఈ ఉదయం వెల్లడించిన విషయం తెలిసిందే. ఉండవల్లిలోని నివాసంలో ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు.







