ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ లో ఆకట్టుకున్న అలమండ నృత్య ప్రదర్శన

UPDATED 30th AUGUST 2018 THURSDAY 6:00 PM

సామర్లకోట: ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోని బంజా కళా మండపంలో ఈ నెల 28, 29 తేదీల్లో జరిగిన ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ లో పట్టణానికి చెందిన ప్రముఖ నృత్యకారుడు అలమండ ప్రసాద్ చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇండియన్ డ్యాన్స్ అకాడమీ-ఎషియన్ డ్యాన్స్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నృత్య ప్రదర్శనల్లో కూచిపూడి నృత్య విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన నృత్యకారుడు ప్రసాద్ కు ఒడిషా రాష్ట్ర  స్త్రీ, శిశు సంక్షేమశాఖా మంత్రి ప్రపుల్ సమల్, టూరిజం, కల్చరల్ అధినేత అశోక్ చంద్ర పండా, ఎంపీ ప్రసన్న పటసాని, శ్రీటీవి చైర్మన్ సుబరత్ జెనా తదితరుల చేతుల మీదుగా నిర్వాహకులు “భారతీయ కళా సన్మాన్-2018” పురస్కారం అందచేసి పూలమాలలు, దుశ్శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రపుల్ సమల్ మాట్లాడుతూ దేశ, విదేశాల్లో ప్రసాద్ కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చి భారతీయ కళా రంగానికి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నృత్యకారుడు ప్రసాద్ మాట్లాడుతూ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్ లో పాల్గోవడం, ప్రతిష్టాకరమైన భారతీయ కళా సన్మాన్-2018 ఆవార్డును అందుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. భారతీయ కళా సన్మాన్ ఆవార్డు అందుకున్న నృత్యకారుడు ప్రసాద్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హెూంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి చంద్రరావు, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ (చిన్ని), కంచి మహాసంస్థానం చైర్మన్ చంద్రాభట్ల చింతామణి గణపతిశాస్త్రి, సీనియర్ నవలా రచయిత, కళాకారులు అంబటి అప్పారావు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ చిత్తులూరి వీర్రాజు (రాజా), రోటరీ క్లబ్ నాయకుడు అంబటి సుబ్రహ్మణ్యం, పారిశ్రామికవేత్తలు పసల పద్మరాఘవరావు, శింగవరపు సాయిబాబు, తులసీధరరావు సోదరులు, కటకం రాంబాబు, ఎస్సీ, ఎస్టీ, బిసి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు బడుగు శ్రీకాంత్, శ్రీ వీరభద్రా జ్యోతిషాలయం నిర్వాహకులు చీమలకొండ వీరభద్రప్రసాద్ (ఆస్ట్రో ప్రసాద్) తదితరులు అభినందించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us