అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021 : విడ్, సోలార్ పవర్ సంస్థలకు బకాయిల చెల్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు రూ.700 కోట్లు చెల్లించామని విద్యుత్ పంపిణీ సంస్థలు న్యాయస్థానం దృష్టికి తెచ్చాయి. జూన్ నెల బకాయిలు చెల్లించాల్సి ఉందని, వీటిని పంపిణీ చేసేందుకు జనవరి 15 వరకు గడువు పెంచాలని పంపిణీ సంస్థలు న్యాయస్థానాన్ని కోరాయి. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 29లోపు జూన్ నెల బకాయిలు చెల్లించాలని విద్యుత్ పంపిణీ సంస్థలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 29కి వాయిదా పడింది.







