Nani: ఏపీలో సినిమా టికెట్‌ రేట్లు.. నాని సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: సినిమా టికెట్‌ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నటుడు నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు. ఈ మేరకు గురువారం ‘శ్యామ్‌సింగరాయ్‌’ చిత్రబృందం కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని.. ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉంది. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే నేను ఇప్పుడు ఏదీ మాట్లాడినా వివాదమే అవుతుంది’’ అని నాని వ్యాఖ్యానించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us