UPDATED 23rd FEBRUARY 2018 FRIDAY 8:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విభాగం రూపకల్పన రంగంలో పరిశోధనలపై అవగాహన కొరకు కాటియా వి5 వర్క్ షాప్ ప్రారంభించినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు శుక్రవారం తెలిపారు. ప్రస్తుత భారతదేశంలోని విప్లవాత్మకత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి విజయవాడకు చెందిన ఎ.పి.ఎస్.ఎస్.డి.సి. డిజైన్ ఇంజనీర్ ఎం. వేధనాధ్ రిసోర్స్ పర్సన్ గా హాజరై కాటియా వి5 సాఫ్ట్ వేర్ గురించి తన అనుభవాలను వివరించారు. డిజైనింగ్ రంగంలో మెకానికల్ ఇంజనీర్స్ కి ఎ.పి.ఎస్.ఎస్.డి.సి అవలంభిస్తున్న అధునాతన డిజైనింగ్ సాఫ్ట్ వేర్, వాటి ఉపయోగాలు, వివిధ ప్రాంతాల్లో అవలంబిస్తున్న నూతన పోకడలు, వ్యాప్తి చెందుతున్న నైపుణ్యాలు గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ ఈ సాఫ్ట్ వేర్ అభివృద్ధి చెందుతున్న దేశంలో అధునాతన పరిజ్ఞానాన్ని, ఎప్పటికప్పుడు మారుతున్న నూతన టెక్నాలజీలను వివరిస్తూ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కలుగచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాథ బాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాల అధిపతులు, ప్రొఫెసర్ డాక్టర్ పి.కుమార్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వి.వి.ఎన్. శరత్, ఆర్. రాజేష్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







