సదుపాయాలు పరిశీలిస్తూ... సూచనలిస్తూ...

రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: త్వరలో దక్షిణ మధ్య రైల్వే జీఎం పర్యటన నేపథ్యంలో విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌(డీఆర్‌ఎం) శివేంద్రమోహన్‌ బుధవారం సాయంత్రం ప్రత్యేక రైల్లో రాజమహేంద్రవరం చేరుకున్నారు. రైల్వేస్టేషనులోని సంయుక్త కర్మీదళ బుకింగ్‌ లాబీ, ప్రయాణికుల విశ్రాంతి గదులు, దివ్యాంగుల మరుగుదొడ్లు, తాగునీటి కొళాయిల పనితీరు, రైల్వే ఉద్యోగుల నివాస సముదాయాలను పరిశీలించారు. జరుగుతున్న అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట ఏడీఆర్‌ఎం, సీనియర్‌ డీఆర్‌ఎం(కోఆర్డినేషన్‌), సీనియర్‌ డీసీఎం, సీనియర్‌ ఆర్పీఎఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్‌ఎం ద్వారపూడి, సామర్లకోట, కాకినాడ రైల్వేస్టేషన్ల పరిశీలనకు వెళ్లారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us