UPDATED 24th JUNE 2017 SATURDAY 6:00 PM
గండేపల్లి: క్రమశిక్షణతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తమ సంస్థ పై నమ్మకం ఉంచి తమ కళాశాలలో చేరే విద్యార్థులకు ముందుగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో నమ్మకంతో తమ విద్యా సంస్థలో చేరుస్తారని, వారి నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టి నాణ్యమైన విద్యను అందించి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు వచ్చే విధంగా తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. సెలవు దినాలలో కూడా తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి ముందుగా వెబ్ లో సెల్ఫ్ రిపోర్ట్ తీసుకుని అపాయింట్మెంట్ కాపీ, జాయినింగ్ కాపీలు తీసుకుని అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ వాటి జిరాక్స్ కాపీలు(3 సెట్లు)తో ఆది, సోమ వారాలు కూడా వచ్చి చేరవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.







