Dhoni:ల్యాండ్ రోవర్ కారు సొంతం చేసుకున్న ధోనీ.. ప్రత్యేకతలు ఎంటో తెలుసా..!

రెడ్ బీ న్యూస్,19 జనవరి 2022 : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరు వినగానే ఎవరికైనా.. అతడు సాధించిన ఘన విజయాలే గుర్తిస్తాయి. కెప్టెన్‌గా భారత జట్టుని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. భారత క్రికెట్ చరిత్రలో ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. ధోనికి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. వింటేజ్ కార్లు, బైకులన్నా అంతే ఇష్టం. వాటి కోసమే ఓ గ్యారేజ్ ను నిర్వహిస్తున్నాడంటే. అవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా అతడి గ్యారేజ్ లోకి మరో వింటేజ్ ల్యాండ్ రోవర్ కారు చేరింది. గత నెలలో గురుగ్రామ్ లోని 'బిగ్ బాయ్ టాయ్స్ (బీబీటీ)' అనే షో రూం నిర్వహించిన వేలంలో పాల్గొన్న ధోని.. 1970 మోడల్ కి చెందిన ల్యాండ్ రోవర్ 3 కారుని సొంతం చేసుకున్నాడు. ఈ ల్యాండ్ రోవర్ కారుకి ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక స్థానం ఉంది. 1970 దశకం నుంచి 1980 మధ్య కాలం వరకు దీన్ని తయారు చేసేవారు. 2.25 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం గల ఈ కారు మ్యానువల్ ట్రాన్సమిషతో నడుస్తుంది. ఆన్ లైన్ వేలం ద్వారా 50 శాతానికి పైగా స్టాక్ ను విక్రయించినట్లు బీబీటీ షో రూమ్ పేర్కొంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us