అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూసిన, కించిపరిచిన వారిని గత ప్రభుత్వంలో చూశామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బహిరంగ వేదికలపై ప్రభుత్వ ఉద్యోగులను అవమానించిన పరిస్థితి గతంలో ఉందన్నారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు దిగజారినా ఉద్యోగులు అడగకపోయినా సీఎం 27 శాతం ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ఐఆర్ ఇచ్చి ఉండకపోయి ఉంటే ప్రభుత్వంపై 18 వేల కోట్ల భారం పడి ఉండేది కాదని తెలిపారు. ఐఆర్ ఇవ్వకుండా ఉంటే పెండింగ్‌లో ఉన్న చిన్నకాంట్రాక్టుల బిల్లులన్నింటినీ ప్రభుత్వం చెల్లించి ఉండేదని ఆయన చెప్పారు.







