జగన్‌ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం: సీబీఐ

హైదరాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో జగన్‌ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ హైకోర్టుకు తేల్చి చెప్పింది. మినహాయింపు ఇస్తే జగన్‌ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో సీబీఐ నిరాకరించినట్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. జగన్‌ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి పదేళ్లయినా కేసులు ఇంకా డిశ్చార్జ్‌ పిటిషన్ల దశలోనే ఉన్నాయని కోర్టుకు వివరించింది. హాజరు మినహాయింపు ఇస్తే విచారణలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపింది. సీబీఐ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సీబీఐ కోర్టులో జగన్‌ హాజరు మినహాయింపు పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us