UPDATED 12th JUNE 2017 MONDAY 4:00 PM
పెద్దాపురం: స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో ఐద్వా ఆధ్వర్యంలో మద్యంపై సమరం పోస్టర్ ను సోమవారం ఆవిష్కరించారు. ఐద్వా పట్టణ అధ్యక్షురాలు యాసలపు ఆనంతలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు. బెల్ట్ షాపులను రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఆ మాటనే మరిచిందని ఎద్దేవా చేశారు. అలాగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ప్రారంభమైన మద్యంపై సమరం జాతా ఈ నెల 13న పెద్దాపురం పట్టణానికి వస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ జాతాను విజయవంతం చెయ్యాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ, రొంగల సుబ్బలక్ష్మి, నెక్కల మంగ, కుమారి, సిరిపురపు వరలక్ష్మి, కరక సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.







