UPDATED 10th FEBRUARY 2022 THURSDAY 06:20 PM
కర్నూలు (రెడ్ బీ న్యూస్): కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో కారు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారులో అదుపుతప్పి ఎక్కువగా నీరు ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. బావిలో పుష్కలంగా నీరు ఉండటంతో కారును గుర్తించడం కాస్త సమస్యగా మారింది. కనిపించకుండాపోయిన కారు కోసం గజ ఈతగాళ్లు పోలీసుల సహకారంతో రంగంలోకి దిగారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.







