UPDATED 21st FEBRUARY 2018 WEDNESDAY 8:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సాక్ రోబోటిక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, భువనేశ్వర్ (ఒరిస్సా) సహకారంతో రోబోటిక్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో మూడురోజుల పాటు రోబోటిక్స్ పై నిర్వహించిన అవగాహనా సదస్సుకు ముఖ్య అతిథిగా సాక్ రోబోటిక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సఖ్యా సింగ్ మహాపాత్ర హాజరైనారు. కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ భావి ఇంజినీర్లకు రోబోటిక్స్ పై అవగాహనా ఎంతో ముఖ్యమని, వాటి యొక్క ఫండమెంటల్స్, ఉపయోగాలను విద్యార్థులకు తెలియచేయడం ఈ ల్యాబ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ముఖ్య అతిథి సఖ్యా సింగ్ మహాపాత్ర మాట్లాడుతూ ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలతో కలిసి సాక్ రోబోటిక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ రోబోటిక్స్ ల్యాబ్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ రీసెర్చ్ ల్యాబ్ విద్యార్థులు నూతన విషయాలు కనుగొనడానికి, తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, పేపర్ పబ్లికేషన్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఇంజనీరింగ్ విద్యార్థులు నూతన విషయాలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు నూతన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ రీసెర్చ్ సెంటర్ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాథబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, డీన్-అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి. కుమార్ బాబు, వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.వి.ఎన్. సంతోష్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







