అవినీతి రహిత సమాజానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి

UPDATED 3rd NOVEMBER 2017 FRIDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో నేషనల్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ - 2017లో భాగంగా కళాశాల గ్రంథాలయ విభాగం, పవర్ గ్రిడ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో " మై విజన్ - కరప్షన్ ఫ్రీ ఇండియా" సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎం. ముత్యాలనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిరహిత సమాజం కోసం, అవినీతిని రూపు మాపడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, అధికారులు వారి విధిని నిర్భయంగా నిర్వహించాలన్నారు. అవినీతి పరులను కఠినంగా శిక్షించేందుకు చట్టాలు చేసే బలమైన న్యాయవ్యవస్థను రూపొందించుకోవాలన్నారు. చట్టాలు చేసే న్యాయవ్యవస్థను రాజకీయ నాయకుల చేతుల్లో కాకుండా ఒక ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా దానికి విశిష్ట అధికారాలు ఇవ్వాలన్నారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ సాధారణ పౌరుడు తన ఓటును నోటు ఇస్తే కానీ వేయడంలేదని, నోట్లు పోసి కొన్న ఓట్లతో గెలిచిన నాయకుడు అవినీతి కాక మరేం చేస్తాడని ఈ విధానం మారాలన్నారు. ప్రతీ ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి మెరుగైన సమాజం కోసం అవినీతిరహిత భారతావని కోసం ఆలోచించాలన్నారు. అనంతరం జేఎన్టీయూకె డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ డాక్టర్ పి. సుబ్బారావు, పవర్ గ్రిడ్ ఎజిఎం బాలనారాయణ, అసిస్టెంట్ జీఎం కె.వి. సత్యనారాయణ మాట్లాడారు. అలాగే నేషనల్ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం. శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ఎస్.టి.వి.ఎస్. కుమార్, పవర్ గ్రిడ్ సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us