UPDATED 22nd JULY 2017 FRIDAY 6:00 PM
పెద్దాపురం: వచ్చే నెల 11 వ తేదీన మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ ఆర్.పుష్పనాథం తెలిపారు. దీనిలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పూజకు వచ్చే భక్తులు తమ వెంట పూజా సామాగ్రిని తీసుకురావాలని ఈ సామూహిక వ్రతాల్లో పాల్గొనే మహిళలు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఆగష్టు 7 వ తేదీన చంద్ర గ్రహణం సందర్భంగా మధ్యాహ్నం మూడు గంటలనుంచి అమ్మ వారి ద్వారాలు మూసివేయడం జరుగుతుందని, తిరిగి 8 వ తేదీ ఉదయం 8 గంటల అనంతరం అమ్మ వారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందన్నారు.







