రికార్డు స్థాయిలో సత్యదేవుని హుండీ ఆదాయం

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: పవిత్ర కార్తికంలో సత్యదేవుడి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. నవంబరు 10 నుంచి డిసెంబరు 10 వరకు హుండీలను తెరచి ఛైర్మన్‌ రోహిత్‌, ఈవో త్రినాథరావు సమక్షంలో శుక్రవారం లెక్కించారు. మొదటిరోజు ప్రధానాలయంలోని హుండీలను లెక్కించారు. రూ.2,14,98,108, రూ.6,41,800 చిల్లర నాణేలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 96 గ్రాముల బంగారం, 220 గ్రాముల వెండి సమకూరింది. మిగిలిన హుండీల్లో సొమ్ము సోమవారం లెక్కించనున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us