విజయదుర్గా పీఠంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

UPDATED 18th AUGUST 2017 FRIDAY 11:00 PM

రాయవరం: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠంలో అత్యంత వైభవంగా శ్రీనివాస కళ్యాణం శుక్రవారం జరిగింది. తిరుపతికి చెందిన అర్చకస్వాములు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముందుగా శ్రీదేవీ, భూదేవీ సమేత విజయ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను సుందరంగా అలంకరించారు. దీనిలో భాగంగా విష్వక్సేన పూజ, పుణ్యా హవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, కన్యాదానం, మాంగల్యధారణ, తదితర కార్యక్రమాలతో స్వామి వారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి, కళ్యాణ విశిష్ఠతను భక్తులకు వివరించారు. అలాగే నక్షత్ర పూర్వక నవగ్రహ సమేత ప్రత్యాది దేవతా సహిత విజయ దుర్గా మహానవావరణ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి గాడ్ ప్రసంగిస్తూ శ్రీనివాస కల్యాణాన్ని తిలకించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయన్నారు. ఈ కల్యాణమహోత్సవాలను రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి పితాని సత్యనారాయణ తిలకించి గాడ్ దివ్యాశీస్సులను పొందారు. ఈ కార్యక్రమంలో పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్( బాబీ) , అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.   
  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us