Hyderabad News: న్యూ ఇయర్‌ వేళ.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులెన్నంటే!

హైదరాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో నిన్న ఒక్కరోజే 3,146 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అధికంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,528 కేసులు, హైదరాబాద్‌లో 1,258, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులు నమోదయ్యాయి. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారు. శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించి మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలగానే వెంటనే వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు 265 బృందాలుగా ఏర్పడ్డారు. పలుచోట్ల తనిఖీలు నిర్వహించి, ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్ పీఎస్‌ల పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేసి బదిలీపై వెళ్లిన సీఐలను సైతం తనిఖీల కోసం పిలిపించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో గతేడాదితో పోలిస్తే పోలీసులు ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో ప్రమాదాలను తగ్గించగలిగారు. పటాన్ చెరువు పీఎస్ పరిధిలో జరిగిన వేర్వేరు రహదారి ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వనస్థలిపురంలో ప్రహరి గోడను కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. రెండు మూడు ఘటనలు మినహా వేడుకలు ప్రశాంతంగానే ముగిశాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us