Kalpika Ganesh : గుండుతో దర్శనమిచ్చిన కల్పిక.. నెటిజెన్లు చేసిన కామెంట్లకు కౌంటర్లు..

UPDATED 14th NOVEMBER 2022 MONDAY 12:30 PM

Kalpika Ganesh : మంచు మనోజ్ ‘ప్రయాణం’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటి “కల్పిక గణేష్”. ‘జులాయి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ వంటి సినిమాల్లో ప్రముఖ సహాయ నటిగా పనిచేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల విడుదలయిన సమంత ‘యశోద’ చిత్రంలోనూ నటించింది. తాజాగా ఈ అమ్మడు డిఫరెంట్ లుక్ లో దర్శనమిచ్చి అభిమానులకు ఝలక్ ఇచ్చింది. బోడి గుండుతో ఉన్న ఆమె ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇక ఈ ఫోటో చూసిన కొందరు నెటిజెన్లు కల్పిక లుక్ గురించి అరా తీస్తుండగా, మరికొందరు మాత్రం కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెటిజెన్లు తిరుపతి గుండా అనే ప్రశ్నలు వేస్తుండగా, ఒక నెటిజెన్ మాత్రం.. “కాన్సర్ అక్క?” అని ప్రశ్నించాడు. దానికి కల్పిక.. “అవును తమ్ముడు నువ్వు హ్యాపీగా” అంటూ సెటైరికల్ గా బదులిచ్చింది. అయితే కొంతమంది ఇది సినిమా లుక్ రియల్ కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కల్పిక కొంచెం స్త్రీ పక్షపాతి (ఫెమినిస్ట్) అంటూ వాదనలు వినిపిస్తుంటాయి. ఈ వైకిరితోనే నిత్యం ఏదో విధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటది. ఇటీవల టాలీవుడ్ స్టార్ కామెడియన్ ‘అభినవ్ గోమటం’పై తీవ్ర ఆరోపణలు చేసింది. మహిళల పట్ల ఇలా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, సైబర్ క్రైమ్ పోలీసులను, అలాగే కొందరు సెలబ్రిటీస్ ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us