గుడా డైరెక్టర్ గా ఎలిశెట్టి నాని

UPDATED 12TH MAY 2017 FRIDAY 11:00 AM

పెద్దాపురం: గోదావరి అర్బన్ డవలప్మెంట్ అథారిటీ ( గుడా) డైరెక్టర్ గా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామానికి చెందిన ఎలిశెట్టి నాని ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనను డైరెక్టర్ గా ఎంపిక చేసినట్లు ఉత్తర్వులు సిద్ధమయ్యాయి. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆశీస్సులతో ఆయనకు గుడా డైరెక్టర్ గా అవకాశం లభించింది. త్వరలో ఆయనకు అధికారికంగా ఉత్తర్వులు అందనున్నాయి. ప్రస్తుతం ఆయన పెద్దాపురం వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. గుడా డైరెక్టర్ గా నాని ఎంపిక కావడం పట్ల ఏఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు ( రాజబ్బాయి), ఎంపిపి గుడాల రమేష్, జెడ్పిటిసి సుందరపల్లి శివ నాగరాజు, వైస్ ఎంపిపి మిరియాల పద్మరాజు, కోఆప్షన్ సభ్యుడు బొడ్డు వెంకన్న, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు( కోటి), ఉపాధ్యక్షుడు సింగన అరవింద కుమార్, కార్యదర్శి జివివి వీర్రాజు, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనే రామారావు, కందుల విశ్వేశ్వరరావు, టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి గవరసాన రాజశేఖర్, సర్పంచ్ కుంచే గాంధీ, ఉప సర్పంచ్ ఎలిశెట్టి చక్రప్రకాష్ తో  పాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు.
 
 
   
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us