Kajol : 12 కోట్లతో రెండు ప్లాట్లు కొనుగోలు చేసిన కాజోల్‌..

UPDATED 18th FEBRUARY 2022 FRIDAY 07:00 AM

Kajol : ఇటీవల బాలీవుడ్ యాక్టర్స్ భారీ ఖర్చు పెట్టి ఇళ్ళు, స్థలాలు, ప్లాట్లు కొంటున్నారు. వీటి కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. తాజాగా ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజోల్‌ రెండు కొత్త ఫ్లాట్లు కొనుగోలు చేసింది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రదేశం జుహులో రెండు ఫ్లాట్లను కొనుగోలుచేసింది. ఈ ప్లాట్లను తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. ముంబైలోని జుహులో ఆమె నివసిస్తున్న శివశక్తి బంగ్లాకు సమీపంలోనే రెండు లగ్జరీ ఫ్లాట్లను అత్యంత భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఓ అపార్ట్మెంట్స్ లో పదవ అంతస్థులో 2000 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న రెండు ప్లాట్లను దాదాపు 12 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తైపోయిందట.

గతేడాదే కాజోల్‌ భర్త అజయ్‌ దేవ్‌గణ్‌ కూడా జుహులో 60 కోట్లు విలువ చేసే బంగళాను కొనుగోలు చేశారు. ఇప్పుడు కాజోల్ కూడా 12 కోట్లు పెట్టి రెండు ప్లాట్లు కొనుగోలు చేయడంతో మరోసారి వీరిద్దరూ వార్తల్లో నిలిచారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us