UPDATED 21st FEBRUARY 2022 MONDAY 07:50 PM
Mekapati Gautam Reddy’s funeral : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎల్లుండి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మొదటగా స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు. కానీ ఉదయగిరిలో అంత్యక్రియలు జరుగనున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే గౌతం రెడ్డి భౌతిక కాయం ఉండగా.. మంగళవారం స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా భౌతిక కాయాన్ని సజావుగా తరలించవచ్చని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎయిర్ అంబులెన్స్ సాయం కోసం ఎదురుచూడగా.. అందుబాటులో లేవని తెలిసింది.







